25-02-2025 01:00:06 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రధాన పట్టణాల్లో నడిరోడ్డుపై అనారోగ్యానికి గురైన మేకలు, గొర్రెల ద్వారా అపరిశుభ్ర వాతావరణంలో మాం సం విక్రయాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు జిల్లా వెటర్నరీ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. నడి బజార్లో దుమ్ము, ధూళి వంటి వాటితోపాటు గొర్రె పొట్టేళ్ల పేరుతో అనారోగ్యానికి గురైన గొర్రె మాంసం విక్రయిస్తూ మాంసప్రియలను నిండా ముంచుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నిరంజన్, జనరల్ సెక్రటరీ, శ్రీనివాసులు, శంకరయ్య ఉన్నారు.