calender_icon.png 8 February, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాల బలోపేతానికి చర్యలు

08-02-2025 08:06:10 PM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య...

చేవెళ్ల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గ పరిధి శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌, మీటింగ్‌ హాల్‌, మహాలింగాపురం(దోబిపేట్‌) గ్రామంలో రూ.78 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌, శంకర్‌పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, మీటింగ్‌ హాల్‌ను ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రాతమిక వ్యవసాయ సహకార సంఘాలతోనే వ్యవసాయ రంగం అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్వ సత్యయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.