calender_icon.png 22 November, 2024 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

05-11-2024 12:36:50 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి  త్వరితగతిన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల వారీగా రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు పడకల గదుల ఇళ్లతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను,  రెవెన్యూ అంశాల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ పట్టాలు సిద్ధం చేయాలన్నారు.

అనంతరం మండలాల వారీగా తహసీల్దార్లతో పెండింగ్ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముకుందరెడ్డి, డీఆర్‌వో వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరామ్, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు..

డ్రగ్స్ నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం సైఫాబాద్ ప్రభుత్వ బాలుర చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించిన ఆయన.. డీఅడిక్షన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు పలు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ర్ట, జాతీయ విలు విద్యా క్రీడల్లో పాల్గొన్న బాలలను అభినందించారు.

అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రైమరీ పాఠశాలను, ఆర్చరీ క్రీడా మైదానాన్ని పరిశీలించారు.డీడీ  మీర్జా రాజ అలీ బేగ్, ఏడీ అబ్జల్, ఐసీడీఎస్ ఏడీ రాజేందర్, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ జయశ్రీ, పర్యవేక్షకులు సంగమేశ్వర్ పాల్గొన్నారు.