- 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సత్ఫలితాలిస్తున్న కూల్ రూఫ్ పాలసీ
- విద్యుత్ పొదుపులో రాష్ట్రానికి మూడు అవార్డులు
- రెడ్‌కో కార్యక్రమాలను వివరించిన అధికారులు
- నేటి నుంచి ఇందన పొదుపు వారోత్సవాలు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): విద్యుత్ పొదుపునకు అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాష్ర్టంలో శనివారం నుంచి 20వ తేదీ వరకు వేడుకలు నిర్వ హించనున్నారు.
రాష్ర్ట పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) విద్యుత్ పొదుపు అంశంతో రూపొందించిన 2025 క్యాలెండర్‌ను భట్టి ప్రగతిభవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభు త్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. గ్రీన్ పవర్ విద్యుత్ రంగంలో పురోగతి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
2030 నాటికి 20 గిగావాట్లు, 2035 నాటికి 40 గిగావాట్ల స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏడాదిలో రెడ్‌కో చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఈసీబీసీ అమలులో రా ష్ర్టం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని అధికారులు చెప్పారు. 879 కమర్షియల్ భవనాలు ఈసీబీసీకి అనుగుణంగా మార్పు చెందడంతో 392.21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యిందన్నారు.
తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు భట్టికి వివరించారు. రెడ్‌కో తీసుకుంటున్న చర్యల వల్ల హైద రాబాద్ నగరంలో 40మెగావాట్ల విద్యుత్ ఆదా అయినట్లు చెప్పుకొచ్చారు. 73 పట్టణాలు, గ్రామపంచాయతీల్లో 17.23 లక్షల వీధి దీపాలను ఎల్‌ఈడీగా మార్చినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో 57,483 పాత విద్యుత్ పరికరాలను ఆధునిక ఎల్‌ఈడీగా మార్చడంతో 2.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందన్నారు.
విద్యుత్ ఆదాలో తెలంగాణ మూడుసార్లు విద్యు త్ పొదుపు అవార్డులను అందుకున్నట్లు అధికారులు వివరించారు. విద్యుత్ పొదుపు వారోత్స వాల సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా మీడియా ద్వారా విస్తృత ప్రచారం, విద్యుత్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీ రె డ్‌కో జీఎం జీఎస్‌వీ ప్రసాద్, డిప్యూటీ జనరల్ మే నేజర్ వెంకటరమణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధిక పాల్గొన్నారు.