calender_icon.png 29 March, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు

25-03-2025 01:17:30 AM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల అర్బన్, మార్చి 24 (విజయ క్రాంతి): న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 20 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.బాధితుల  ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.