పీసీసీఎఫ్ డోబ్రియాల్
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ ౬ (విజయక్రాంతి): పులుల సంరక్షణకు ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులు కృషి చేయాలని పీసీసీఎఫ్ డోబ్రియాల్ అన్నారు. సిర్పూర్ (టి) మండలం మాకిడి జక్కాపూర్ సమీపంలో మహారాష్ట్రతెలంగాణ ఫారెస్ట్ అధి కారులతో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశానికి స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఈలు సింగ్ మేరుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ.. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని.. మృగాలు దాడులు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలో అనుస రిస్తున్న విధానాల అధ్యయనానికి త్వరలోనే ఆ రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు.
పులుల సంరక్షణ, దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆ రాష్ట్ర అధికారులను అడి గి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ట్రిబేవల్, చంద్రపూర్ సబ్ డీఎఫ్‌వో అవధుత్‌వార్, దాబా ఆర్‌ఎఫ్‌వో గౌర్‌కార్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓ సాహుబాయాలజిస్ట్ ఏలం తదితరులు పాల్గొన్నారు.