* హైదరబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): జిల్లాలో భిక్షాటన చేస్తున్న పిల్లలు, వీధిబాలలు, బాలకార్మికుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలె అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా మహిళా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కన్వర్జేన్స్ ఆన్ ఆపరేషన్ స్మైల్ సమా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలో బాల కా గుర్తించి సంరక్షించాలని, వారి పనిచేయించుకునే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ శైలజ, డీసీపీ లావణ్య, ఐసీడీఎస్ పీడీ అక్కేశ్వర్‌రావు, జి కార్మికశాఖ అధికారి జాసన్, ఆర్డీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పారదర్శకంగా రేషన్ కార్డుల సర్వే
రేషన్ కార్డుల జారీ కోసం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మెహదీపట్నం మండలం విజయనగర్ కాలనీ, హుమాయున్‌నగర్ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రమేష్, రెవె జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.