09-04-2025 05:57:05 PM
ఇచ్చోడ (విజయక్రాంతి): వేసవి కాలం దృష్ట్యా మండలంలోని అన్ని గ్రామాలలో నీటి ఎద్దడి నివారణ కోసం అన్ని చర్యలను తీసుకున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. ఇందులో భాగంగానే బుధవారం మండలంలోని నవేగామ్ గ్రామంలో పర్యటించి చేతి పంపులను పరిశీలించారు. త్రాగు నీరు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎక్కడైనా తాగునీరు సమస్య ఉన్నట్లయితే వెంటనే స్థానికంగా ఉన్న అధికారులకు తెలియజేయాలన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు.