calender_icon.png 12 March, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు దృష్టిలోప నివారణ చర్యలు

12-03-2025 05:52:24 PM

జిల్లా వైద్యాధికారి సీతారాం 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో దృష్టిలోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. బుధవారం విద్యార్థులకు అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యా సంస్థల్లో పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహించగా 931 మందికి దృష్టిలోపమునట్లు గుర్తించడం జరిగిందన్నారు. మొదటి  విడత 471 అద్దాలు వచ్చినట్లు తెలిపారు. మహాత్మ జ్యోతి రావు పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు అద్దాలను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రత్నా బాయి, ఆర్ బి ఎస్ కే వైద్యులు నరేందర్ రెడ్డి, పూజ, ఫార్మసిస్ట్ యాస్మిన్, ఏఎంఎన్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.