సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్
జహీరాబాద్, జనవరి 28: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ పట్టణం లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఫోను మాట్లాడుతూ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ద్విచక్ర వాహనాలు నడిపేవారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాల న్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్ఐలు కాశీనాథ్, రాజేందర్ రెడ్డి తదితరులున్నారు.