calender_icon.png 31 October, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

14-08-2024 03:10:48 AM

  1. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతాం 
  2. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో డీజీపీ జితేందర్

సంగారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి ఎస్పీ కార్యా లయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. జాతీయ రహదారి ఇంజినీరింగ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమా దాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై, దొంగతనాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల ్లడించారు. సంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకొని పోలీ సు అధికారులకు పలు సూచనలు చేశారు. 

అనంతరం సీసీ కెమెరాల కంట్రోల్ రూంను పరిశీలించారు. ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు. సదాశివపేట పోలీసు స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌ను డీజీపీ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ క్రాంతి వలూ ్లరు, సంగారెడ్డి ఎస్పీ రూపేష్, అదనపు ఎస్పీ సంజీవ్‌రావుతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.