calender_icon.png 9 January, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

08-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల, జనవరి 7 (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా సంబం ధిత అధికారులను ఆదేశించారు.  జిల్లా రో డ్డు భద్రత కమిటీ సమావేశాన్ని మంగళ వారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్‌తో కలిసి  కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఆర్‌అండ్‌బీ రోడ్లు, పంచా యతీ రోడ్ల వద్ద ఉన్న, మున్సిపాలిటీ పరిధి లో గల ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొల గించాలని, రోడ్లమీద వాహనాలు పా ర్కింగ్ చేయకుండా తగు చర్యలు చేపట్టాలని చూ డు అధికారులను ఆదేశించారు.

ప్రధాన కూడళ్లలో, అప్రో రోడ్డు ల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయుటకు పార్కింగ్ స్థలాలు, ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి సంబధిత  అధి కారులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించా రు. ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడి యం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించ డం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకర మని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి వారం ఒకరు చనిపోతున్నారని, దీని నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని జిల్లా ఎస్పీ సూచిస్తూ జిల్లాలో అధి కంగా రోడ్డు ప్రమాదాలు జరిగే తంగళ్ళపల్లి, తిప్పాపూర్  రోడ్, గంభీరావుపేట్, కోనరా వుపేట ముస్తాబాద్, చందుర్తి, బోయినపల్లి, కోదురుపాక  జంక్షన్ వంటి 13 ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్ లకు గుర్తించి అక్కడ రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అనంత రం రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు సూచించే గోడ ప్రతులు, పోస్టర్లను ఆవిష్కరించినారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్ అండ్ బీ. ఈ.ఈ. వెంకట రమణయ్య, జిల్లా రవాణా అధికారి లక్షన్ , మున్సిపల్ కమిషనర్లు, లావణ్య,అన్వేష్, పి.అర్.ఈఈ సుదర్శన్ రెడ్డి , జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా ఎక్సుజ్ శాఖ అధికారి పంచాక్షరి, ఆర్. టి.సి. డి.ఎంలు, నేషనల్ హైవేస్ అధికారు లు, సంబంధిత సిబ్బంది పాల్గోన్నారు.

ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలి

ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేలా పరిశు భ్రత పనులు చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. స్వచ్చత, పరిశు భ్రత తదితర అంశాలపై జిల్లాలోని  ఎంపీడీ వోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యద ర్శులు, ఇతర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిత్యం ఉదయం 9 గంటలకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలో ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకో వాలని, మురికి కాలువలు లేని చోట క మ్యూనిటీ సోక్ పిట్ నిర్మించాలని ఆదేశించా రు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి ఇతర పన్నులు 100 శాతం వసూలు చేయాలని  ఆదేశించారు.

విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వి ద్యాలయాలు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యం పారిశుధ్య పనులు చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, డీఎల్పీఓ నరేష్, ఎస్బీఎం సురేష్ పాల్గొన్నారు.