calender_icon.png 12 February, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

12-02-2025 12:51:06 AM

పోలీసు, భూగర్భ జల, మైనింగ్ శాఖల అధికారులతో పోలీస్ కమిషనర్ సమావేశం

ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) :- ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమి షనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశిం చారు. అదనపు డీసీపీలు నరేష్ కుమార్, ప్రసాద్ రావు తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అధికారి సాయినాధ్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ అధికారి రమేష్ ఇతర అధికారులతో మంగళవారం పోలీస్ కమి షనర్ కార్యాలయంలో సమావేశం నిర్వ హించారు.

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బం దీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాలలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమా నాలు విధించడం, కేసులు నమోదు చేయ డం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.