calender_icon.png 9 January, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నేరు వరద నియంత్రణకు చర్యలు

03-01-2025 12:28:02 AM

ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, జనవరి 2 (విజయక్రాంతి): మున్నేరు వరద నియం త్రణకు సంబంధించి చేపట్టాల్సిన పను ల్లో మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో కలిసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ డిజైన్ తదితర అంశాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకు న్నారు. అత్యధికంగా వరద ప్రవాహం ఉన్న సమయంలో మున్నేరు నది వద్ద 3 లక్షల 50 వేల క్యూసెక్కుల  నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా బఫర్ జోన్ నిర్ధేశిస్తూ రిటైనింగ్ వాల్ డిజైన్ చేశామని కలెక్టర్ తెలిపారు.  మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఆమోదం పొందిన డిజైన్ ప్రకారం భూసేకరణ చేపట్టాలన్నారు.