calender_icon.png 3 April, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణకు చర్యలు

03-04-2025 01:26:17 AM

ప్రణాళిక రహిత అభివృద్ధి జరగకుండా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులు 

వంద మీటర్ల వరకు కొత్త అనుమతులివ్వొద్దని స్పష్టం

నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మూసీ, ఈసా నదుల పునరుజ్జీ వనానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా చూడాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ జీవో నంబర్ 180 ద్వారా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూసీ పరివాహక ప్రాంతం, బఫర్ జోన్‌లో పలు నిర్మాణాలు జరుగుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మూసీ, ఈసా నదుల పర్యావరణ సమతౌల్యత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణకు నలుగురు సీనియర్ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ), జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ), హెచ్‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేటర్ జేఎండీతో కమిటీని ఏర్పాటు చేశారు. మూసీ, ఈసా నదుల వద్ద బఫర్ జోన్‌లో 50 మీటర్ల లోపు నిర్మాణాలు చేపట్టొద్దని, 100 మీటర్ల వరకు అనుమతులివ్వొద్దని స్పష్టం చేసిం ది. 

మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు.. 

మూసీ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ ఖరార య్యే వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని నలుగురు సభ్యుల కమిటీలోని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. అది పూర్త య్యే వరకు ప్రణాళికరహితంగా అభివృద్ధి జరుగొద్దనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరార్థం రోడ్లు, బ్రిడ్జిల లాంటి అభివృద్ధి పనులు ప్రభుత్వం తరఫున చేపట్టాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అనుమతిని తప్పనిసరి అని తేల్చిచెప్పింది.