calender_icon.png 6 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధికుక్కల దాడుల నియంత్రణకు చర్యలు

06-02-2025 01:45:36 AM

  1. 80 శాతం స్టెరిలైజేషన్ పూర్తి
  2. హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ నివేదిక 

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ, పరిసర జిల్లాల్లో వీధి కుక్కల నియంత్రణకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. వీధి కుక్కలను గుర్తించి 80 శాతం స్టెరిలైజేషన్ పూర్తి చేసినట్టు తెలిపింది. వీధి కుక్కల దాడి ఘటనపై పత్రికలో ప్రచురితమైన కథనాన్ని పిల్‌గా తీసుకొని విచారణ చేపట్టింది.

దీనిపై తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టి స్ రేణుక యారాలతో కూడిన బెంచ్ బుధవారం మరోసారి విచారించింది హైకోర్టు ఆ దేశాల మేరకు జీహెచ్‌ఎంసీ నివేదిక దాఖలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కే ఇలంబర్తి హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

జాతీయ సంక్షేమ జాతీయ మండలి చేసిన సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నామని, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, అవగాహన, సంక్షేమ కార్యక్రామాలకు 2022 నుంచి 2024 డిసెంబరు వరకు రూ.29.67 కోట్లు కేటాయించగా, రూ.9.21 కోట్లు ఖర్చు అయిందన్నారు.