calender_icon.png 26 November, 2024 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

26-11-2024 01:07:10 AM

సిరిసిల్ల మార్కెటింగ్‌శాఖ అధికారి ప్రకాశ్

సిరిసిల్ల, నవంబర్ 25 (విజయక్రాంతి): సీసీఐ కొనుగోలు కేంద్రాల కు పత్తిని తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని సిరిసిల్ల జిల్లా మార్కెటింగ్‌శాఖ అధి కారి ప్రకాష్ అన్నారు. విజయక్రాంతి దినపత్రికలో ‘ధర ఖరారు దళారులదే’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని, లేదంటే మిల్లు వారికే రైతులు విక్రయిస్తున్నారని తెలిపారు.

రైతులు పంట వివరాలు ఆన్‌లైన్ నమోదు అయిన వారు నేరుగా సీసీఐకి పత్తిని తీసుకువచ్చి అమ్ముకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో పంట వివరాలను నమోదుకాని రైతులు వ్యవసాయశాఖ రెండు రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుందని వాటి ఆధారంగా పత్తిని అమ్ముకోవచ్చని తెలిపారు.