calender_icon.png 4 March, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు

03-03-2025 08:55:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగిలో తాగునీరు, సాగునీరుకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలకు చివరి దశ వరకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ నీరును ప్రతి గ్రామానికి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిపిఓ శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, మిషన్ భగీరథ ఈ సందీప్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.