మేడ్చల్, జనవరి 28(విజయ క్రాంతి): ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ట్రాఫిక్ అదనపు డీసీపీలు, ఏసీపీలు, రవాణా శాఖ, రోడ్లు భవనాల అధికారులు, జిహెచ్‌ఎంసి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. సమావేశంలో రోడ్డు ప్రమాదాలు, తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.