జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో భిక్షాటన నియంత్రణకు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని బాలల సంక్షేమ కమిటీ కార్యాలయాన్ని శనివారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాలలకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జనవరి ఒకటి నుంచి జిల్లాలో బిగ్ షెటర్ల నియంత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మురళి అధికారులు పాల్గొన్నారు.