05-03-2025 07:27:19 PM
జనగామ (విజయక్రాంతి): నిరంతర విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డీఈ లక్ష్మినారాయణ రెడ్డి అన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిరంతర విద్యుత్ కోసం జనగాం టౌన్ 1 సెక్షన్ పరిధిలో నూతన 100 కెవిఏ, 63కెవిఎ సామర్థ్యం గల రెండు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బత్తిని సౌమ్య, సబ్ ఇంజనీర్ మనోహర్, ఫోర్ మెన్ వీరాంజనేయులు, ఎస్ ఎల్ఐ రవీందర్, ఎల్ ఐలు రాంబాబు, రవీందర్ రెడ్డి, ఎల్ ఎంలు ప్రసాద్, రాజు, ఏఎల్ ఎంలు రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.