10-03-2025 05:42:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ సుదర్శన్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... 15 రోజులుగా విద్యుత్కు డిమాండ్ పెరిగినప్పటికీ రైతులకు గృహ వినియోగదారులకు ఎలాంటి కోతులు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన లక్షణము విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.
గ్రామాల్లో పట్టణాల్లో అధికారులను 24 గంటలపాటు అందుబాటులో ఉంచి ఎక్కడ ఏ సమస్య వచ్చినా 10 నిమిషాల్లోనే ఆ సమస్య పరిష్కారం చేస్తున్నామన్నారు. ఇందుకోసం విద్యుత్ శాఖ 1912 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని విద్యుత్ శాఖలో అంతరాయం ఉన్న ప్రమాదాలకు ఆస్కారమున వెంటనే వారు ఈ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. రైతులు పంట పొలాల రక్షణకు కరెంటు కంచెలు ఏర్పాటు చేసుకోవద్దని సోలార్ సిస్టంను అమర్చుకోవాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ పంటల కొత్త కనెక్షన్ల కోసం ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినించుకోవాలని సూచించారు.