19-04-2025 12:35:52 AM
ఖమ్మం ఏప్రిల్ 18 ( విజయక్రాంతి ):-ప్రణాళికాబద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మా త్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నా రు. శుక్రవారం మంత్రి, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ లోటస్ హిల్స్ లో టియుఎఫ్‌ఐడిసి నిధులు రూ. 100 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మా ణ పనులకు నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా మం త్రి తుమ్మల నాగేశ్వర రా వు మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిది ద్దాల ని, క్రమపద్ధతిలో అభివృ ద్ధి చేయాలని, వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం అభివృద్ధి జరగాల ని అన్నారు. ఖమ్మం నగరంలో ఉన్న అధికార యంత్రాంగం,ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టాలని మంత్రి సూచించారు. లోటస్ హిల్స్ నందు డైనైజ్ వ్యవస్థకు ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.నది, కాల్వ లపై అక్రమ నిర్మాణాలు, రోడ్డుపై ఏ రకమైనమత ప్రార్థనా మందిరాలు ఉండవద్దని, అట్టి వాటిని ప్రారంభంలోనే అడ్డుకోవాన్నారు.
క్రమపద్దతిలో అభివృద్ధి చేస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుందని అన్నారు. ఆక్రమణలలో ఎక్కడైనా పేదలు ఉంటే వారికి అవసరమైన ఇండ్ల స్థలం, ఇండ్లు, జీవనోపాధికి ప్రభుత్వ పథకాల క్రింద ద్వారా సహాయం అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ము న్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధికి కోట్ల రూ పాయలను మంత్రులు మంజూరు చేయించారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్ర ప్ర భుత్వం నుంచి కూడా నిధులు సాధించడం జరిగిందని అన్నారు.
చేపట్టిన పనులు నాణ్యతతో, కాలపరిమితితో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపా రు. అనంతరం మంత్రి 39వ డివిజన్ జై బా పు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్ర మంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కె ట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారా వు,పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఖమ్మం అర్బన్ మండల తహ సీల్దా ర్ రవికుమార్, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళీ, రాపర్తి శరత్, ఇతర కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.