నిర్మల్, జనవరి 21 (విజయక్రాంతి): కొయ్య బొమ్మల పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న నిర్మల్ కొయ్యబొమ్మల కేంద్రాన్ని సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొయ్య బొమ్మల పరిశ్రమను మరింత అభివృద్ధి చేయన్నుట్టు తెలిపారు. హస్తకళల కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయనవెంట నాయకులు సమత సుదర్శన్, డిప్యూటీ మేనేజర్ శీప్రాణి ఉన్నారు.