calender_icon.png 28 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల పరిరక్షణకు చర్యలు

28-11-2024 01:22:18 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): మహానగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు హైడ్రా సమగ్ర చర్యలు చేపడుతున్నదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఆయన నిజాం తలాబ్ లేక్ (తురక చెరువు), మాదాపూర్ మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్ నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్ వనంచెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు చెరువుల ఆక్రమణ గురించి వివరించారు. చెరువులను కబ్జా నుంచి విడిపించి, పూర్వవైభవం తీసుకురావాలని వినతి పత్రాలు అందజేశారు. చెరువుల సుందరీకరణ పేరుతో బఫర్ జోన్ ప్రాంతాలను కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గేటెడ్ కమ్యూనిటీల నుంచి వచ్చే మురుగు చెరువుల్లోకి వదులుతున్నారని వాపోయారు. కమిషనర్ స్పందిస్తూ..  చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటా మని స్థానికులకు హామీ ఇచ్చారు.