ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో యువతీ, యు వకులకు స్వయం ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్ లో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెట్విన్ సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు ఎం అనిల్‌కు మార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం నిరుద్యోగ యువతకు ఉత్తమ అవకాశాలను అందించడానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సెట్విన్‌కు చెందిన ఫ్యా షన్ డిజైనింగ్ శిక్షణ పొందుతున్న అభ్యర్థు లు, బ్యూటీషియన్ విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం సెట్విన్ ఆధ్వర్యంలో రానున్న ఆన్‌లైన్ కోర్సులకు సంబం ధించిన బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సెట్విన్ ఎండీ వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు వాణిదేవి, మీర్ రహ్మత్ అలీ బేగ్ ఖాద్రీ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివరాంరెడ్డి పాల్గ్గొన్నారు.