- 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తికి ఆర్డర్లు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల కు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకుంటున్నదని, దీనిలో భాగంగానే 96.03 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం జౌళిశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో మాట్లాడారు.
అన్ని ప్రభుత్వశాఖలు, కార్పొరేషన్ల నుంచి అవసరమైన ఆర్డర్లు తెప్పించుకోవాలని సూచించారు. టెస్కో నుంచి సంఘాల ద్వారా వస్త్రాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని టెస్కో ఎండీ శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. జీవో 18 ద్వారా వేములవాడ యార్న్ డిపోకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు.