ఆదిలాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనాన్ని అం దించి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదిలాబద్ కలెక్టర్ రాజరిషా ఆశ్రమ పాఠశాల సి బ్బందిని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఆదిలా బాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయ న తనిఖీ చేశారు.
నాణ్యమైన భోజనాన్ని అందించాలని, పరిసరాలు, వంటగది, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అం దించే భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా సిలబస్ పూర్తి అయ్యేలా చూడలన్నారు. ఆయనవెంట హెచ్‌ఎం లలిత కుమారి ఉన్నారు.