శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్‌లోని ఓ ఇంట్లో డ్రగ్స్ ముఠా ఉనట్లు గుర్తించిన చందనగర్ పోలీసులు పక్కా సమచారంతో ఆ ఇంటిపై దాడులు జరిపారు.రాజస్థాన్ రాష్ట్రం జలోరి జిల్లా బగోడ తాలుకాకు చెందిన కృష్ణారామ్ (28) ఓ బ్యాగు తీసుకుని గురువారం రాత్రి శేరిలింగంపల్లి గుల్మోహర్ లోనీ తన స్నేహితుదు స్టీల్ వ్యాపారం చేస్తున్న తన గ్రామానికి చెందిన రూపారామ్ ఇంటికి వచ్చాడు.
ఫ్రెష్ అప్ అయి వెళ్లిపోతానని చెప్పాడు.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రాజస్థాన్ నుండి వచ్చిన కృష్ణారామ్ కు రాత్రి ఉండేందుకు అనుమతి ఇచ్చాడు. అయితే అతను తీసుకువచ్చిన బ్యాగ్, అతని వ్యవహార శైలి,తీరుపై అనుమానం వచ్చిన రూపారామ్ అతను స్నానం చేసేందుకు వెళ్లగానే అతను తెచ్చిన బ్యాగును తనిఖీ చేశాడు.అందులో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన రూపారామ్ వెంటనే చందానగర్ పోలీసులకు,నార్కోటిక్ డ్రగ్స్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గుల్మోహర్ పార్క్ కాలనీలోని రూపారామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడు కృష్ణారామ్ ను అదుపులోకి తీసుకోవటంతో పాటు అతను తెచ్చిన బ్యాగులో నుండి 155 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు.