calender_icon.png 24 November, 2024 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీకేజెడ్ సంస్థ ఎండీ అరెస్ట్

11-10-2024 12:59:18 AM

పెట్టిన పెట్టుబడులకు డబుల్ ఇస్తామంటూ రూ.229 కోట్ల వసూలు

అనంతరం బోర్డు తిప్పేసి పరారీ

బాధితుల ఫిర్యాదుతో ఎండీ సహా డైరెక్టర్ అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): పెట్టిన పెట్టుబడులకు కేవలం 25 రోజుల్లోనే డబుల్ ఇస్తామంటూ వేలాది మంది నుంచి సుమారు రూ. 229 కోట్లు కొల్లగొట్టి పరారైన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. దాదాపు ఐదేళ్ల క్రితం మాదాపూర్‌లో డీకేజెడ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఏర్పాటైంది.

పెట్టిన పెట్టుబడులకు 25 రోజుల్లోనే రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రముఖ యూట్యూబర్స్‌తో రీల్స్ చేయించా రు. యూట్యూబర్స్ కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించినట్లు చెప్పడంతో నిజమేనని నమ్మిన వేలాది మం ది బాధితులు రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు.

ఈ మొత్తం సుమారు రూ. 229 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపా రు. చివరకు లాభాలు పక్కన పెడితే అసలుకే టోపీ పెట్టారు కంపెనీ నిర్వాహకులు. నగరవ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. 

ఈ క్రమంలో గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు గురువారం డీకేజెడ్ టెక్నాలజీస్ ఎండీ సయ్యద్ అష్ఫాక్ రాహిల్, సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అతడి భార్య సయేదా ఐషా నాజ్‌ను  అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ సీపీ సీపీ ఆనంద్ తెలిపారు.