calender_icon.png 2 November, 2024 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవు

30-08-2024 04:12:23 PM

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఎం సిపిఐ నాయకులు 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఎన్సీపీఐ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి తహసీల్దార్ జ్యోస్నకు వారు హామీలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. వృద్ధులకు రూ 4000, వికలాంగులకు రూ 6000, రూ 500 కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందన్నారు. రేషన్ కార్డు విషయాన్ని పూర్తిగా మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చని పక్షంలో ఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరెపల్లి వేణు, ఆరేపల్లి సతీష్ లు పాల్గొన్నారు.