- జీజీహెచ్‌కు గర్భిణులు, బాలింతల తరలింపు
- 130 మందిని సొంత మండలాల్లోని పీహెచ్‌సీలకు
మంచిర్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వర్షాలు కురిసి గోదావరి ఉప్పొం గితే మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్ర ం(ఎంసీహెచ్)లో ఎత్తిపోతలు మొదలవుతాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు తెరవడం తో గోదావరి ఉధృతి పెరిగి వరద నీరు పుష్కరఘాట్ వరకు చేరుకుంది. వంద మీటర్లలోపే ఎంసీహెచ్ ఉండటంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు సోమవార ం గర్భిణులు, బాలింతలను ఆంబులెన్సుల లో జీజీహెచ్‌తోపాటు పది ప్రైవేటు ఆసుపత్రులకు తర లించారు. 130 మంది ఇన్ పేషెంట్లు ఉండగా చాలా మంది ని డిశ్చార్జీ చేసి వారి సొంత మండలాల్లోని పీహెచ్‌సీలకు 102 వాహనాల్లో పంపించారు. ఎంసీహెచ్‌ను ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంఅండ్‌హెచ్‌వో హరీష్‌రాజ్ పరిశీలించారు.