calender_icon.png 11 January, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ‌డ్డె ఓబ‌న్న విగ్ర‌హం ఆవిష్క‌రిస్తున్న ఎంబీసీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ జైపాల్‌

11-01-2025 07:32:23 PM

వడ్డెర కులస్తులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం 

ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్

రామ‌చంద్రాపురంలో వ‌డ్డె ఓబన్న విగ్రహావిష్కరణ 

రామ‌చంద్రాపురం,(విజయక్రాంతి): వడ్డెర కులస్తులకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్(MBC Corporation Chairman Jeripeti Jaipal) అన్నారు. శనివారం స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న(Vadde Obanna Statue) 218వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి మెదక్ జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ వరికుప్పల లింగయ్య ఆధ్వర్యంలో వడ్డెరబస్తీలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వడ్డెర జాతికి గర్వకారణమైన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా  నిర్వహిస్తున్నామని అన్నారు.

దాదాపు 6000 మందితో రవీంద్ర భారతిలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలు అందరూ హాజరవుతున్నారని అన్నారు. రామచంద్రాపురంలో వడ్డెర కుల సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు వరికుప్పల లింగయ్య ఆధ్వర్యంలో భారీ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలో నాయకులు శ్రీరాములు, సాయికుమార్, బొంత నరసింహ, అంజయ్య, ముత్యాలు, ఎట్టయ్య,  సిద్దయ్య, పెద్దులు, వడ్డెర కుల సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.