calender_icon.png 26 November, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్‌ సీట్లు

10-10-2024 08:14:14 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలికలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. తల్లిదండ్రులు కొంక రామచంద్రం, శారద తమ కుమార్తెల విజయాలకు గర్వకారణం. పెద్ద కుమార్తె మమత 2018లో ఎంబీబీఎస్‌ సీట్ పొంది చదువు పూర్తి చేసి డాక్టర్ గా కొనసాగుతుంది. రెండో కుమార్తె మాధవి 2020లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందింది. ఈ ఏడాది మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు.

మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో తమ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీకి కృతజ్ఞతలు తెలుపుతూ  సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్‌రావును కొంక రామచంద్రం కుటుంబంతో కలిశారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందని, స్థానిక విద్యార్థులు ఎక్కడికి వెళ్లకుండా వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించిందని వారు వ్యాఖ్యానించారు. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన నలుగురు అమ్మాయిలను ఎమ్మెల్యే హరీష్ రావు శాలువాతో సత్కరించి అభినందించారు.