calender_icon.png 1 October, 2024 | 3:08 AM

ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి రౌండ్ సీట్ల అలాట్‌మెంట్

01-10-2024 01:00:51 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న కన్వీనర్ కోటా అభ్యర్థుల లిస్టును మొదటి దశ కౌన్సిలింగ్ తర్వాత కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు స్థానికతపై ఉత్తర్వులు పొందిన అభ్యర్థులకు సైతం సీట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థుల జాబితాను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించి కన్వీనర్ కోటా సీట్లను కేటాయించారు. కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లో జాబితాను విడుదల చేశారు. 60 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల పరిధిలో మొత్తం 5,455 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తున్నారు. 

నీలిమా మెడికల్ కాలేజీ ఇకపై అనురాగ్ యూనివర్సిటీ

నీలిమ మెడికల్ కాలేజీని అనురాగ్ యూనివర్సిటీ ద్వారా ఎంబీబీఎస్ సీట్ల ను కేటాయిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. అనురా గ్ యూనివర్సిటీ ద్వారా 150 సీట్లలో జనరల్ కోటా 85 శాతం సీట్లను ఏడాదికి రూ. 15 లక్షల చొప్పున, ఎన్‌ఆర్‌ఐ కోటా 25 శాతం సీట్లను రూ. 22.50 లక్షల చొప్పున ఫీజుగా నిర్ణయిస్తూ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో మల్లారెడ్డి తర్వాత మరో కాలేజీ కూడా మేనేజ్‌మెంట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లను భారీ ఫీజుతో తమ ఇష్టానుసారంగా సీట్లను విక్రయించుకునేందుకు అవకాశం ఏర్పడింది.