23-04-2025 07:05:51 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఎస్ఐగా ప్రమోషన్ పొందిన ఎస్డి మజారుద్దీన్ ను బెల్లంపల్లి రూరల్ సిఐ ఆఫీసులో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ అఫ్జలుద్దీన్ మాట్లాడుతూ... నియమ నిబద్ధతతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూఎస్సైగా ప్రమోషన్ పొందడం ఆయన పనితీరు, మంచితనానికి గుర్తింపు అని కొనియాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం సవాళ్ల తో కూడుకొని ఉన్నదన్నారు. అయినా కూడా సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. ఇంకా భవిష్యత్తులో మరెన్నో ప్రమోషన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాళ్ల గురజాల ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.