calender_icon.png 27 November, 2024 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మజ్దూర్ యూనియన్ కృషి

06-11-2024 03:02:36 PM

కాప్రా (విజయక్రాంతి): రైల్వే కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కృషి చేస్తుందని సికింద్రాబాద్ డివిజనల్ కార్యదర్శి పి రవీందర్ పేర్కొన్నారు. రైల్వే ఘట్కేసర్ బ్రాంచ్ మజ్దూర్ యూనియన్ సభ్యులు చర్లపల్లి, మౌలాలి, లాలాగూడా, అమ్ముగూడా, రైల్వేస్టేషన్లో ఎల్సి గేట్లు గ్యాంగ్ యూనిట్లు తిరిగి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ ధ్యేయంగా దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కృషి చేస్తుందని, కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి పక్షాన ఉండే యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూర్ యూనియన్ అని అయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 5 6 తేదీల్లో జరగబోయే యూనియన్ ఎలక్షన్లలో సౌత్ సెంట్రల్ రైల్వే మద్దూర్ యూనియన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘటికేసరి బ్రాంచ్ కార్యదర్శి బొల్లెపల్లి శ్రీనివాస్, ఘట్కేసర్ బ్రాంచ్ చైర్మన్ డి విజయ్ కుమార్, ఘట్కేసర్ బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దిలీప్ కుమార్, వై వెంకటేశ్వర్లు, ఏ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.