సీసీ రోడ్లు, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి... నూతనంగా నిర్మాణం చేసిన మహిళా సంఘ భవనం ప్రారంభించిన మేయర్.
నగరంలో జరిగిన అభివృద్ధి పట్ల చాలా సంతృప్తి కలుగుతుంది.
నగర వ్యాప్తంగా చాలా డివిజన్ లలో మహిళా సంఘ భవనాలు నిర్మాణం చేశాం.
నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు ప్రజలకు కావల్సిన అన్ని సదుపాయాలు కల్పించాం.
కరీంనగర్ (విజయక్రాంతి): మా పాలకవర్గం హయాంలో నగరం నలువైపుల అభివృద్ధి చెందిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా సోమవారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు 35, 53వ డివిజన్ లలో పర్యటించారు. మొదటగా సప్తగిరి కాలనీలో స్థానిక కార్పోరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 35 లక్షల సాధరణ నిధులతో ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం డివిజన్ లో దాదాపు 40 లక్షలతో మహిళా సంఘం సభ్యుల కొసం అన్ని రకాల వసతులు కల్పిస్తూ... నూతనంగా నిర్మాణం చేసి మహిళా సంఘం భవనాన్ని కార్పోరేటర్ బుచ్చిరెడ్డి, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులతో కలిసి భవనాన్ని ప్రారంభం చేశారు. మరో వైపు నగరంలోని 53వ డివిజన్ కశ్మీగడ్డలో స్థానిక కార్పోరేటర్ శ్రీదేవి చంద్రమౌళితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 5 లక్షల నిధులతో కలిసి ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు.
చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... 5 సంవత్సరాల పదవి కాలంలో నగర ప్రజలకు మెరుగైన సేవలందించామనే సంతృప్తి మా పాలకవర్గానికి కలిగిందన్నారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో రాబోయే రోజుల్లో దీవెనలు అందుకుంటామన్నారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు వివిధ గ్రాంట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ములు, మార్కెట్లు, మహిళ, కుల సంఘ భవనాలు, యూత్ క్లబ్ భవనాలు ఇలా చాలా రకాల అభివృద్ధి పనులను చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించామని తెలిపారు. సప్తగిరి కాలనీ, శ్రీనగర్ కాలనీల్లో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కాలనీల్లో చక్కటి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయడంతో పాటు కావల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పించామని తెలిపారు.
సుమారు 40 లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించామని, ఈ భవనాన్ని కాపాడుకునే బాధ్యత మహిళలదే అన్నారు. నగర వ్యాప్తంగా చాలా డివిజన్ లలో మహిళా సమాఖ్య సంఘాల కోసం నగరపాలక సంస్థ నిధులతో భవనాలను నిర్మాణం చేశామని తెలిపారు. మహిళా సంఘ భవనాల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు, బీరువాలో, మరుగుదొడ్ల సౌకర్యం కూడ కల్పించామని తెలిపారు. ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్ల నిర్మాణము లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా సంఘ భవన నిర్మాణాలు యువజన సంఘ భవననిర్మాణాలు కులసంఘ భవననిర్మాణాలను కూడా చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా ఆలయాల్లో మసీదుల్లో గురుద్వారాలో కూడ మౌలికవసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే నగరంలో అభివృద్ధి చేసిన పార్కులను కూడా ప్రారంభం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న రాజీవ్ పార్కును కూడ ప్రారంభం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మా పాలకవర్గం హయంలో చాలా వరకు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. నగరం నలువైపులా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావల్సిన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. మా పాలకవర్గం హయంల జరిగిన అభివృద్ధి ఏ పాలకవర్గం జరగలేదని ఒక గొప్ప చరిత్ర అన్నారు. రాబోయే రోజుల్లో కూడ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు అయూభ్ ఖాన్, ఓం ప్రకాష్, గట్టు స్వామీ తదితరులు పాల్గొన్నారు.