* నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసిన మేయర్.
* పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధే ద్యేయంగా మా పాలకవర్గం పని చేసింది.
* గత 5 సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వందల కోట్ల నిధులతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.
* కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా రావడంతోనే నగర రూపురేఖలు మారాయి.
* ప్రజల ఆశీర్వాదంతో మా పాలకవర్గం గొప్పగా పని చేసి ప్రజా సమస్యలన్ని పరిష్కరించింది.
* కరీంనగర్ నగరంలో మా పాలకవర్గం చేసిన అభివృద్ధి చరిత్ర నిలిచిపోతుంది.
* జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు... అదే మాకు గర్వకారణం.
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో మా పాలకవర్గంలో జరిగిన అభివృద్ధి గత 70 ఏళ్లలో ఏ పాలకవర్గంలో జరగలేదని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా 15,30,34,47,54 డివిజన్ లలో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంబించారు. మొదటగా 15వ డివిజన్ లో స్థానిక కార్పోరేటర్ నాగసముద్రం జయలక్ష్మితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 40 లక్షలతో ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్డు నిర్మాణంకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 30వ డివిజన్ కాపువాడ ప్రాంతంలో స్థానిక కార్పోరేటర్ నేతికుంట యాదయ్యతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీపూజ చేశారు. 34వ డివిజన్ గోదాంగడ్డలో కార్పోరేటర్ షఖీరా అంజూమ్ బర్కత్ అలీతో కలిసి మరో 40 లక్షలతో ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.
మరో వైపు 47వ డివిజన్ లో స్థానిక కార్పోరేటర్ షర్ఫోద్దిన్ తో కలిసి 50 లక్షలతో డ్రైనేజీ పైపులైన్, సీసీ రోడ్డు నిర్మాణంకు భూమీపూజ చేసి పనులు ప్రారంభం చేశారు. అనంతరం 54వ డివిజన్ లో కార్పోరేటర్ ఇఫ్రాన్ తహేరిన్ అథీనాతో కలిసి 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీపూజ చేసి పనులు ప్రారంభం చేశారు. డివిజన్ వారిగా చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.... కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా రావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన వందల కోట్లు నిధులు తెచ్చి నగరంలో ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. గత 70 ఏళ్లలో ఏ పాలకవర్గంలో జరగని అభివృద్ధి కేవలం మా పాలకవర్గంలోనే జరిగిందని అన్నారు.
నగర అభివృద్దే ద్యేయంగా మా పాలకవర్గం పని చేసిందని తెలిపారు. 60 డివిజన్ లలో కార్పోరేటర్లు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు కావల్సిన మౌలిక వసతులన్ని కల్పించామని అన్నారు. దాదాపు 1400 కోట్ల నిధులు ఖర్చులు చేసి... నగర వ్యాప్తంగా చక్కటి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేస్కోవడంతో పాటు డివిజన్లతో పాటు ప్రధాన రహదారుల్లో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అహ్లదం పంచేందుకు డివిజన్ లతో పాటు నగరంలో పార్కులను సుంధీకరించి.. ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాకులు, ఒపెన్ జిమ్ములను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతే కాకుండా డివిజన్ లలో మహిళ సంఘ భవనాలు, కుల సంఘ భవనాలు నిర్మాణం చేశామని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అధునీకరించి... స్మార్ట్ ఈ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు సుచి శుభ్రతతో కూడిన ఆహార పదార్థాలను అందించేందుకు సమీకృత మార్కెట్లను నిర్మాణం చేస్తున్నామని... పద్మానగర్ మార్కెట్ ను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. మరో 3 మార్కెట్ల పనులు అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చాలా ప్రాజెక్టుల పనులు ఇప్పటికే పూర్తి చేసి... ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. నగర ప్రజలకు త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ప్రతి రోజు త్రాగు నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర మంత్రులచే 24/7 పాయిలెట్ ప్రాజెక్టును ప్రారంభం చేసి 4 వేల కనెక్షన్లకు 24 గంటల నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మా పాలకవర్గం పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేసి... ప్రజలకు కావల్సిన మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. చేసిన అభివృద్ధి పనులన్ని ప్రజలకు కనిపిస్తున్నాయని తెలిపారు. 8 విలీన గ్రామాల అభివద్ధే ద్యేయంగా పని చేసి... కొత్తగా విలీనమైన గ్రామాల డివిజన్ లలో వందల కోట్ల నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామన్నారు. విలిన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లను దాదాపు 75 శాతం అభివృద్ధి చేసి... ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
విలీన గ్రామాల త్రాగు నీటి సమస్యను తీర్చేందుకు అమృత్ 2 పథకం కింద 147 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే 30 సంవత్సరాల వరకు త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఇలా అన్ని రకాల నిధులను నగర అభివృద్ధి కోసం కేటాయించి అభివృద్ధి పనుల జారత చేశామన్నారు. కరీంనగర్ నగర అభివృద్ధిని నిరంతరంగా కొనసాగించేలా చర్యలు తీస్కుంటామని తెలిపారు. మా పాలకవర్గం చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు కావల్సిన అభివృద్ధి, సంక్షేమం అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు. మా పాలకవర్గం ముగిసే లోపు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకొని మా పాలకవర్గం ఒక నిబద్దతో పని చేసిందని తెలిపారు. మా పాలనలో కరీంనగర్ నగరం అభివృద్ధి చేంది... ప్రజల సమస్యలు తీరడం మా అదృష్టంగా బావిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్ నగర అభివృద్ధిని నిరంతరంగా కొనసాగించేలా పని చేస్తామని తెలిపారు. చేసిన అభివృద్ధితో ప్రజల ఆశీర్వాదం మళ్లీ మాకు ఉంటుందని... ప్రజల మమ్ము ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో కార్పోరేటర్లు చాడ గొండ బుచ్చిరెడ్డి, అనూప్, బండ సుమ రమణ, రాపర్తి విజయ, కొండపల్లి సరిత సతీష్, డివిజన్ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.