calender_icon.png 28 December, 2024 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలను తెచ్చి దేశ రూపు రేఖలు మార్చిన నాయకులు

27-12-2024 04:56:39 PM

కరీంనగర్,(విజయక్రాంతి): 2004 నుండి 2014 వరకు ప్రధాన మంత్రిగా సంస్కరణలను పరుగులు పెట్టించి... దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన రాజనీతి జ్ఞడు మన్మోహన్ సింగ్ అకస్మిక మరణం పట్ల నగర మేయర్ యాదగిరి సునీల్ రావు(Mayor Yadagiri Sunil Rao) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణం దేశానికి తీరనిలోటని... ప్రగాడ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ సంధర్బంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ...భారత దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధాన మంత్రుల్లో  మన్మోహన్ సింగ్ ఒకరని గుర్తు చేశారు. అంకు ముందు ఆర్థిక మంత్రి పనిచేసిన మన్మోహన్ సింగ్ ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూప శిల్పిగా చెబుతారని అన్నారు.

అవిబాజ్య భారతదేశం లోని పంజాబ్ ప్రావిన్స్(Punjab Province)లో జన్మించి...రాజకీయ చానక్యుడిగా ఎదగారని అన్నారు. మన్మోహన్ సింగ్ 1991 లో కేంద్ర ఆర్థిక మంత్రి(Union Finance Minister) అయిన తర్వాత రాజకీయంగా ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా దశలో ఉన్నప్పుడు... ఆర్థిక మంత్రి గా దేశంలో తిరుగులేని  అర్థిక సంస్కరణల కార్యక్రమాలకు బాటలు వేశారని అన్నారు. పన్నులను తగ్గించి... రూపాయి విలువను నిలబెట్టిన గొప్ప ఆర్థికవేత్త అని కొనియాడారు. ప్రధాన మంత్రి గా తొలి ఐదేళ్ల లో అతిపెద్ద విజయం అమెరికాతో  అణు సాంకేతిక పరిజ్ఞానానికి చరిత్రాత్మక ఒప్పదం కుదుర్చుకున్నారని తెలిపారు. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా  విభిన్న ప్రాంతీయ పార్టీలకు, మద్దతుదారులకు నేతృత్వం వహించిన గొప్ప మహానుభావుడు.

2004 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ హాయంలోనే ఎన్నో కీలక చట్టాలు రూపొందింపబడ్డాయన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు గృహహింస నిరోధక చట్టం, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం, విద్యాహక్కు చట్టం, భూసేకరణ చట్టం లాంటి ఎన్నో చట్టాలను తెచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అన్నారు. ఎన్నో తెలివితేటలు, అపార జ్ఞానం, అంకితభావం తో దేశానికి సేవలందించి మన్మోహన్ సింగ్ తన మృదు స్వభావంతో నిర్ణయాత్మక వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి అన్నారు. దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం అంకితభావం, నిబద్దతతో పని చేసిన మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరనిలోటు అని అన్నారు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... సంతాపం తెలిపారు.