calender_icon.png 31 January, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాపై మేయర్ మార్క్ ..!

31-01-2025 02:08:27 AM

  1. మీ లీడర్ ఎవరంటూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై ఎదురుదాడి 
  2. బడ్జెట్‌పై చర్చే లేకుండా ఆమోదింపజేసిన వైనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): బల్దియాలో బడ్జెట్ సమావేశం రసాభసాగా జరిగింది. బీఆర్‌ఎస్ పార్టీలో గెలుపొంది మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మూడేళ్ల పాటు సైలెంట్‌గా వ్యవహరించిన మేయర్, డిప్యూ  మేయర్ పార్టీ ఫిరాయింపు అనంతరం ఏడాది కాలంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆయా సెక్షన్లను పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టి తన ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నిస్తున్నారు. 20  జూలై 6న జరిగిన జనరల్ కౌన్సిల్ స  తనదైన శైలిలో స్పందించారు. ఏ మాత్రం అవకాశం లభించిన బీఆ  పార్టీపై, ఆ పార్టీ కార్పొరేటర్లపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే గురువారం 2025 ఏడాది బల్దియా బడ్జెట్ సమావేశంలో మేయర్ మరింత దూ  పెంచి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై ఎదురుదాడికి దిగి బల్దియాలో తనదైన ముద్ర వేశారనే చెప్పవచ్చు. అందరూ బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎలా వ్యవహరిస్తారనే విషయంపైనే చర్చించుకున్నారు కానీ..

సమావే  అడ్డొచ్చిన వారిని మార్షల్స్‌తో గెంటివేసి బడ్జెట్‌పై అసలు చర్చే లేకుండా అరగంటలోపే ఆమోదం పొందినట్టుగా వ్య  ఎవరూ ఊహించలేదు. ఇది  ఉండగా, కౌన్సిల్ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ కార్పొ  డెవలప్‌మెంట్‌పై మీకు ఇంట్రస్ట్ లేకుంటే వెళ్లిపోండి అని మేయర్ అన్నారు.

వెళ్లిన వాళ్లు మళ్లీ ఫండ్స్ గురించి మాట్లాడొద్దంటూ ఓ వైపు సావధానంగా మాట్లాడుతున్నట్టుగా కౌన్సిల్‌ను నడిపిస్తూనే మరోవైపు పరోక్షంగా హెచ్చరించడం విశేషం. ఈ సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరైన అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ను ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ.. మీ సభ్యులకు సభా మర్యాదలు పాటించాలని నేర్పలేదా అం  ప్రశ్నించారు.

అంతే కాకుండా, జీహెచ్‌ఎంసీలో అసలు మీ లీడర్ ఎవరంటూ బీఆర్‌ఎస్ సభ్యులను నిలదీయగా, వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా.. ఏం చెప్పాలో తెలియని అయోమయంలో పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో కూడా కౌన్సిల్‌లో ఎక్కువసేపు విషయాన్ని చర్చను సాగదీయకుండా, విపక్షాలకు అవకాశం  ఇవ్వకుండా మేయర్ చాకచక్యంగా వ్యవహరించారు.