కరీంనగర్, జనవరి26 (విజయక్రాంతి): కరీంనగర్ లో శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రోజు నగరంలోని చైతణ్యపురి కాలనీలోని యూనియన్ మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో 25 మందిని భారతీయ జనతా పార్టీ లో సాధారణ సభ్యులగా చేర్చి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు క్రీయాశీల సభ్యత్వాన్ని స్వీకరించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్జి చేతుల మీదుగా పార్టీ సభ్యత నమోదు పత్రాన్ని స్వీకరించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలుపుతూ... మేయర్ యాదగిరి సునీల్ రావు కు భారతీయ జనతా పార్టీ బలోపేతం పై పలు సలహాలు, సూచనలు చేశారు.