హైదరాబాద్,(విజయక్రాంతి): లక్డీకాపూల్ పరిధిలో ఉన్న హోటల్స్ లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించని పలు హోటల్స్ పై ఆహార భద్రత అధికారులతో కలిసి హోటల్స్ లోని ఆహర పదార్థాలను పరిశీలించారు. మొఘల్ రెస్టారెంట్ లో ఆహార పదార్థాల తయారీని తనిఖీ చేసిన మేయర్ రెస్టారెంట్ కిచెన్ మెత్తం ఆపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం నిల్వ చేయడంపై రెస్టారెంట్ యజమానిని నిలదీశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించి, నివేదిక వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు.