హైదరాబాద్,(విజయక్రాంతి): సూరారంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) బుధవారం పర్యటించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల(Food Safety Officials)తో కలిసి మేయర్ జీపీ ఫుడ్స్ కంపెనీ(GP Foods Company)లో తనిఖీలు చేపట్టారు. జీపీ ఫుడ్స్ ను పరిశీలించిన మేయర్ అవాక్కయ్యారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో తిను బండారాలు తయారీపై జీపీ పుడ్స్ యజమానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు.