calender_icon.png 4 January, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన మేయర్ అజయ్ పుట్టినరోజు వేడుకలు

01-01-2025 10:46:01 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్న మేయర్..

అభిమానుల సన్మానాలు, కేక్‌ కటింగులు...

ప్రభుత్వ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు షూస్ పంపిణీ...

మహిళలు, యువతీ యువకుల కోసం సెట్విన్ సెంటర్ ప్రారంభం 

మేడిపల్లి (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ జన్మదిన వేడుకలు బోడుప్పల్ లోని దేవి కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా ఉదయం బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ చేసి, అశోక్ నగర్ కాలనీలో టిపిసిసి ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ సర్పంచ్ తోటకూర లక్ష్మీ జంగయ్య యాదవ్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పోరేటర్ పోగుల నర్సింహ్మరెడ్డి, కార్పోరేటర్లలతో కలిసి మహిళలు, నిరుద్యోగ యువతీయువకుల స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు సెట్విన్ సెంటర్ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ నిర్వహించి అభిమాన నేతను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అండదండలతో బోడుప్పల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. నన్ను నమ్ముకున్న వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, బోడుప్పల్ కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వం గుప్తా, కార్పోరేటర్లు కొత్త చందర్ గౌడ్, బొమ్మక్ కళ్యాణ్ కుమార్, భూక్య సుమన్ నాయక్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, కొత్త దుర్గమ్మ పాండు గౌడ్, బొమ్మకు సుగుణ బాలయ్య, దొంతరమైన మహేశ్వరి కృపా సాగర్, కోఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న గౌడ్, నాయకులు దానగళ్ళ యాదగిరి, పులకండ్ల జంగారెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, 13వ డివిజన్ యూత్ నాయకులు జన్నె రాజు, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మకు అజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శులు ఉప్పుగళ్ళ ప్రశాంత్, ఆసర్ల మౌనిక బీరప్ప, మేడిపల్లి మండల యూత్ కాంగ్రెస్ చిలుముల అజయ్ రెడ్డి, బోడుప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దుల శ్రీకాంత్ యాదవ్, బోడుప్పల్ నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసర్ల బీరప్ప, బోడుప్పల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సమత యాదవ్, మెడ్చల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.