calender_icon.png 16 January, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు

15-01-2025 10:02:54 PM

మందమర్రి (విజయక్రాంతి): బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి జన్మదిన వేడుకలను చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్ లు హాజరై, పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా మాయావతి పని చేశారని అన్నారు.

సీఎంగా ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. దేశవ్యాప్తంగా మాయవతి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని, కాంగ్రెస్, బీజేపీ లకు దీటుగా బీఎస్పీ జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తన సత్తా చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నూరి రాజు, సుందిళ్ల అశోక్, సమ్మయ్య, రామిల్ల రాజేష్, వేముల వీరేందర్, శ్యామ్ లు పాల్గొన్నారు.