తూమణి మాడత్తు= స్వచ్ఛమైన, సహజమైన మణులతో నిర్మితమైన భవనంలో, చుట్రుం= చుట్టూ.. అం త టా, విళక్కు ఎరియ= దీపాలు వెలుగుతూ ఉం డగా, ధూపం కమళ= సుగంధ ధూపాలు వ్యా పిస్తుండగా, త్తుయిల్ అణైమేల్= పడుకున్న వెంటనే నిద్ర వచ్చేంత మెత్తని పడకపై, కణ్ వళరుమ్=కనులుమూసుకుని నిద్రిస్తున్న, మామాన్ మగళే=మామకూతురా, మణిక్కదవమ్= మణులతో నిర్మితమైన తలుపు, తాళ్= గడియను, తిఱవాయ్= తెరవవోయ్, మామీ ర్= ఓ అత్తా, అవళై ఎళుప్పీరో= నీ కూతురు ను లేపవమ్మా, ఉన్ మగళ్ దాన్= నీ కూతు రు ఏమైనా, ఉమైయో= మూగదా, అన్ఱి= లేకపోతే, చ్చెవిడో= చెవిటిదా, అనన్దలో= అలసి పోయి నిద్రిస్తున్నదా, ఏమప్పట్టాళో= కావలిలో ఉంచినారా, పెరుందియిల్= చాలాసేపు నిద్ర పోయేట్టు, మందిరప్పట్టాళో= మంత్రం తో కట్టుబడి ఉన్నదా, మామాయన్= మహామాయావీ, మాధవన్= మాధవుడా, వైగుంద న్= వైకుంఠవాసా, ఎన్ఱు ఎన్ఱు= అని మళ్లీ మళ్లీ, పలవుమ్= సహస్రాధికములైన అతని, నామమ్= భగవన్నామాలను, నవిన్ఱు= కీర్తించాము.
మేలైన తొమ్మిది రకాల మణులతో నిర్మితమైన మేడ, అందులో పడుకోగానే నిద్ర వచ్చే మెత్తని పరుపు, చుట్టూ దీపాల వెలుగులు, సు గంధ ధూపాల ఘుమఘుమలు, హాయిగా ని ద్రపోతున్నావా ఓ మామ కూతురా! మణి కవాటపు గడియ తీయవా? ఓ అత్తా ! నీవైనా నీ కూతురిని నిద్ర లేపవా? నీ కుమార్తె మూగ దా? లేక చెవిటిదా? లేక ఎవరైనా కదలినా ఒప్పుకోమంటూ కావలి పెట్టారా, లేక గాఢ ని ద్ర పట్టునట్లు మంత్రించినారా? మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేక భగవన్నామాలను కీర్తించి ఆమె నిద్ర లేచే వి ధంగా చేయవమ్మా.
మొదటి రెండు పాశురములలో శ్రవణం గురించి వివరించా రు. త ర్వాతి పాశురంలో మననం ప్రాధాన్యం నిరూపించారు. నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించారు. ‘నిస్వార్థమైన వ్రతనిష్ఠ కలిగిన వారికే తాను దక్కుతానని’ అన్నాడు శ్రీకృష్ణు డు. ‘అట్లా అయితే మనకు స్వాతంత్య్రం ఎం దుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు.
కనుక మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు’ అనే ధ్యానంలో పరాకాష్ట పొంది నిద్రిస్తున్న నాల్గవ గోపికను ఈనాడు మేల్కొల్పు తున్నారు. ‘ఓ మామ కూతురా! మరదలా లేవమ్మా!’ అంటున్నారు. ‘పలుకు దేనెల తల్లి పవళించెను’ అని ‘కలికితనముల విభుని గలసినది గాన నిగనిగని మోముపై నె ఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను’ అని అన్నమయ్య పాట పాడినట్టుగా గోపాంగన అంటున్నది. గోపిక నిద్రిస్తున్నదట.
గోపికలు నిద్రిస్తున్న గోపాంగనా భవన వైభవ వర్ణనతో పాశురం మొదలవుతుంది. నవరత్న ఖచిత భవనం, ధూపదీపాలతో వెలిగే నివాసం. మణులు దోషరహితమైనవట. పరిశుద్ధం చేసినవట. శరీరమనే భవనం సంసారబంధాలతో కప్పి ఉండడం వల్ల ప్రకాశాన్ని కోల్పోతాయి. మోక్షదశకు చేరేనాటికి కర్మబంధాలు తొలగి ప్రకాశిస్తూ ఉంటాయి. నవమణులు అంటే నవద్వారాలతో కూడిన శరీర భవనమని ప్రతీక. మలినాలు తొలగిన జీవివలె భవన శరీరం భాసిస్తున్నది.
జీవుడికి పరమాత్మతో ఉన్న సంబంధాలలో ఆధార ఆధేయ సంబంధం ముఖ్యమైంది. ‘జీవుడు ఆధేయం, పరమాత్మ ఆధారం’ అని దీని అర్థం. అంటే, జీవునకు పరమాత్మ శరీరం వంటివాడు. ఆ పరమాత్మ ఎప్పుడూ సహజమైన మణులతో ప్రకాశిస్తూ ఉంటాడు. మరకత పేటికలో పెట్టిన వస్తువు ఏ విధంగా బయటకు కనిపిస్తుందో అదే విధంగా భగవంతుడి హృదయంలో భక్తుడు కనిపిస్తూ ఉంటాడు. భగవంతుని భవనం కన్న ఈ గోపాంగనా భవనం సహజ మణులతో నిర్మితమైందని గోపికలు మెచ్చుకుంటున్నారు.