- మహిళల ఉచ్చులో చిక్కుంటున్న వ్యక్తులు
వివాహేతర సంబంధాలతో పోతున్న ప్రాణాలు
వరుస ఘటనలతో ప్రజల్లో కలవరం
సిరిసిల్ల, డిసెంబర్ 31(విజయక్రాంతి): ప్రపంచమంతా సాంకేతిక రంగం వైపు దగ్గరవుతుంది. మానవ సంబంధాలు మా త్రం దూరమవుతున్నాయి. మాయ మాటలు చెప్పే మహిళల ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు పోతున్నాయి. వారిని నమ్ముకుని ఉన్న కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటన లతో ప్రజల్లో కలవర పెడుతుంది.
కొందరు మహిళలు ఈజీగా డబ్బులు సంపాదించుకు నేందుకు మనుషులను వశపరచు కుంటు న్నారు. ముగ్గులోకి దింపిన తర్వాత పైసల్ వసూల్ చేయడం, ఒకవేళ ఇవ్వకపోతే బెది రింపులకు పాల్పడడం ఈమధ్య పరిపాటిగా మారింది. మాయ మాటలు నమ్మి వలలో పడ్డ తర్వాత క్షణికానందం కోసం నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
వారిని నమ్ముకొని ఉన్న కుటుంబాలను వీధిన పడేస్తూ అనాధలను చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో మాయ లేడీలతో భయాందో ళనలకు గురి అవుతున్నారు. ఇటీవల జరిగిన కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ పల్లం సత్తయ్య మాయలేడి ఉచ్చులో చిక్కు కోని ఏకంగా ఆత్మహత్య చేసుకున్న సంఘట న స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఐకేపీ కేంద్రంలో సీసీగా పని చేస్తున్న ముఠా రేణుకా మాయమాటలు చెప్పి పల్లం సత్తయ్యను లోబర్చుకోవడం కాకుండా అతని వద్ద నుంచి రూ.25 లక్షల వరుకు పైసల్ తీసుకోని, నిత్యం వేధింపులకు పాల్పడింది. మరిన్ని పైసల్ లాకున్నే ప్రయత్నంచేయగా, గత్యంతరం లేక సత్తయ్య తఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసు కవచ్చిన ఆ మాయలేడిని జైల్లో చిప్ప కూడు తినిపించేందుకు పోలీసు లు పంపించారు.
అదేవి ధంగా పక్షం రోజుల క్రితం వేములవాడ పట్టణంలో హోంగార్డుగా విధులు నిర్వహి స్తున్న వడ్ల అనూష రాజన్న ఆలయంలో రిటైర్డ్ ఉద్యోగి వద్ద మాయ మాటలు చెప్పి, రూ. 5 లక్షల పైసల్ వసూల్ చేసింది, అంతేకాకుండా ఆటో డ్రైవర్ వద్ద దాదాపు రూ. 30 లక్షలు వసూలు చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హోంగార్డును కటకటాల వెనక్కి నేట్టారు.
నెల రోజుల క్రితం కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఓ లేడి వ్యాపారి గ్రామంలో తెలిసిన వారి నుంచి దాదాపుగా రూ.20 లక్షల వరకు అప్పులు చేసి, ఊరి నుంచి పరారైంది. దీంతో అప్పులు ఇచ్చిన బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సదరు లేడి ఆచూ కీ తెలియకపోవడంతో అప్పులు ఇచ్చినవారు లబోధితోమంటున్నారు.
పది రోజుల క్రితం వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామా నికి చెందిన రసీదు అనే యువకుడు అక్రమ సంబం ధం పెట్టుకోవడంతో, ఆ మహిళ భర్త అతికిరాత కంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. దీంతో రసీదు కుటుం బం వీధిన పడింది. మహిళతో అక్రమ సంబంధమే రసీదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
అదేవిధంగా ములుగు జిల్లాలోని వాజేడు ఎస్సు హరీష్ నల్గొండలోని ఓ మహిళతో మిస్డ్ కాల్ తో పరిచయమై, సర్వీస్ రివాల్వర్ కాల్చుకోని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దారితీసింది. ఆ మహిళ వేధింపుల కారణంగానే ఎస్సు ఆత్మహత్య చేసుకోవడం, మంచి భవిష్యత్తు ఉన్న హరీష్ ఆత్మహత్య ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపింది.
అంతేకుండా నాలుగు రోజుల క్రితం బీబీపేట స్టేషన్లో మహిళ కాని స్టేబుల్ శృతి వేధింపులకు బిక్కునూర్ ఎస్పు సాయికుమార్ తో పాటు ఆపరేటర్ నిఖిల్ సైతం చెరువులో పడి ప్రాణాలు కొల్పోయిన ఘటన మన కళ్ల ముందే కదలాడుతోంది.
శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సాయి కుమార్ సైతం ఓ మహిళ వేధింపులతోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా మాయ లేడీల ఉచ్చు లో చిక్కుకోని ప్రాణాలతో పాటు పైసల్ పోగోట్టుకుం టున్నారు. వారి మీద ఆధార పడ్డ కుటుంబా లను మాత్రం వీధిన పడేస్తున్నారు.
ఒక్కసారి మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పరచు కునే సమయంలో తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటే ఇలాంటి దారు ణాలు జరగకుండా నివారిం చవచ్చని మానసిక వైద్య నిపుణులు తెలుపు తున్నారు. ఏది ఏమైనా మాయ లేడీల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉంటేనే పైనల్, ప్రాణాలు ఉంటాయని, సమాజంలో గౌవరంతోపాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండవ చ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.