calender_icon.png 1 April, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఏడాదిలో సమృద్ధిగా వర్షాలు కురవాలి

30-03-2025 12:54:38 AM

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉగాది శుభాకాంక్షలు

శుభాకాంక్షలు తెలుపుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటన

ప్రజలకు శుభం కలగాలి: సీఎం రేవంత్‌రెడ్డి

పంటలు సమృద్ధిగా పండాలి: మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండి రైతు లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజ లు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తెలంగా ణ ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలి

రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానున్నందున ఈ నూతన సంవత్సరంలో రాష్ర్ట ప్రజలకు శు భం కలగాలని, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.

సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. ఉగాది పండుగ రోజున రాష్ర్టంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

పంటలు సమృద్ధిగా పండాలి

తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతిని ఆయన ప్రారంభించారు. ఉగాది పచ్చడి మాదిరి జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతి సందర్భాన్ని వివేచనంతో ఎదుర్కోవడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూతుందన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటన ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు :మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజూ పండుగ రోజేనని పేర్కొన్నారు.