31-03-2025 01:32:41 AM
* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
* పటాన్ చెరులో ఘనంగా పంచాంగ శ్రవణం
* హాజరైన ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు
పటాన్ చెరు, మార్చి 30 : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన కాంతి వెలుగులు నింపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభిలాషించారు.
ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మాజీ జడ్పీటీసీ జైపాల్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, ప్రతాప్ గౌడ్, ప్రకాష్ రావు, మాజీ ఎంపిటిసి రామచంద్ర రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
- దేవాలయాల సందర్శన..
ఉగాది పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్ చెరు పట్టణ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం సొసైటీ చైర్మన్ పాండు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.